11 June, 2026 | 3:09 PM

రేవంత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ

03-02-2025 03:23 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingi Police Station)లో ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని 4 ఏళ్ల క్రితం పటిషన్ దాఖాలైంది. జన్వాడ ఫాంహౌస్ వద్ద డ్రోన్ ఎగురవేశారని 2020 మార్చిలో కేసు నమోదు అయింది.నార్సింగి పోలీసులు రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని రేవంత్ రెడ్డి పిటిషన్  లో పేర్కొన్నారు. పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది(Senior Advocate) కేసును వాదిస్తారని రేవంత్ రెడ్డి తరుఫు న్యాయవాది తెలిపారు. విచారణను ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.