calender_icon.png 8 December, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఏఎస్ ఆమ్రపాలికి బిగ్ షాక్

08-12-2025 07:13:40 PM

హైదరాబాద్: ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని  తెలంగాణకు కేటాయిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (క్యాట్) జారీ చేసిన ఆదేశాలపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతరం ఉత్తర్వలు జారీ చేసింది. సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) అక్టోబర్ లో ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులపై ఆమె క్యాట్ లో సవాల్ చేశారు. దీంతో ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ మళ్లీ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. విచారణ చేపట్టిన ధర్మసనం ఆ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆమెకు తెలియజేస్తూ క్యాట్ ఉత్తర్వులను నిలిపివేసింది. తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ప్రస్తుతం ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.