calender_icon.png 9 December, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ట్విస్ట్..!

09-12-2025 12:37:11 AM

  1. పంచాయతీ పోరులో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్

సింగారంలో రెండు వర్గాల నేతలు పరస్పరం పోటీ

కత్తి మీద సాములా నేతల మధ్య పోరు 

ముగ్గురు ముగ్గురే.. రాజకీయ ఉద్దండు లే..

సర్పంచ్ పీఠం కోసం పాట్లు, గెలుపు కోసం ఎత్తులుపై ఎత్తులు

ఫుట్ బాల్ ఎగిరేనా..?, బ్యాట్ విజయాన్ని లేడీ పర్స్ గండి కొట్టేనా .. 

ప్రజల తీర్పు ఎటువైపు, చరిత్ర సృష్టించేదెవరు..?

ఆసక్తికరంగా మారుతున్న ‘సింగారం’ రాజకీయం

మణుగూరు, డిసెంబర్ 8 (విజయక్రాంతి): పేరులోనే సింగారంతో అభివృద్ధి పథంలో బంగారంగా విరాజీల్లుతున్న మం డలంలోని మేజర్ పంచాయతీ సమి తి సింగారంలో పల్లె పోరు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది.పల్లెపోరు హ స్తం పార్టీలో అగ్గి రాజేసిందా,మరో మారు వర్గ పోరును బట్టబయలు చేసిందా, పా త, కొ త్తగా విడిపోతున్న నేతలు పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారా, లోపం ఎక్కడుందో, సమస్య ఎవరి వల్ల వస్తోందో తెలిసినా& నో రెత్తలేని పరిస్థితులు ఆ పా ర్టీలో నెలకొన్నాయనే అభిప్రాయాలు వ్య క్తం అవు తున్నాయి.

ఇక్కడ మాత్రం పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉం టోందని, అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం లా కని పిం చడం లేదని స్వయంగా హస్తం నేతలే అం టున్నారు. మరోవైపు పంచా యతీ పీఠం కో సం ముగ్గురు నేతలు తమ వారిని గెలిపించుకునేందుకు బలంగా పా వులు కదుపు తుండటంతో ఈ పోరు విజే త ఫై ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చ సా గుతోంది. సమితిసింగారం పల్లె పోరుపై విజయక్రాంతి కథనం.. 

కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్..

మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉండగా, సమితి సింగారం మేజర్ గ్రా మ పంచాయతీ పై కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్, వలస కాంగ్రెస్ లీడర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ సీనియర్ లీడర్ల అ నుచరులు రం గంలోకి దిగ డంతో బుజ్జగింపులకు తలో గకుండా ఎవరి కి వారే పోటీలో నిలబడ డం ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్యే పాయం ఆశీస్సులతో క లబోయిన మాధ వరావు బరిలో ఉండగా జి ల్లా కాంగ్రెస్ నేత తుళ్లూరు బ్రహ్మయ్య ఆశీస్సులతోబచ్చల భారతి సిపిఎం పొత్తుతో టిడిపి అభ్యర్థిగా భరిలో ఉన్నారు.ఎవరికి వా రే తాను బలపరిచిన అభ్య ర్దులను బరిలో దింపి గెలిపించుకునే ప్రయత్నాల్లోఉన్నా రు.

ముగ్గురు ముగ్గురే.. రాజకీయ ఉద్దండు లే..

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత పో రుపై కన్నేసిన పినపాక మాజీ ఎమ్మెల్యే తమ అభ్యర్థి గెలుపు కోసం స్వయంగా రంగంలోకి దిగారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివాసంలో ఉండే ఈ పంచాయతీని కైవసం చేసుకొని అధి కార పార్టీకి దీటైన స మాధానం ఇచ్చేందు కు ఇక్కడ బీఆర్‌ఎస్ తన సొంత అన్న కుమార్తె గుండి గౌరీని పో టీలో నిలిపారు. ఆమె విజయం కోసం ఆ యన సర్వశక్తు లు వడ్డుతున్నారు.

ఇదిలా ఉండగా అ ధికార పార్టీ నుండి కలబోయిన మాధవరా వు గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్యే కృ షి చేస్తు న్నారు. మరోవైపు గత ఎన్నికలలో ఎమ్మె ల్యే విజయం కోసం కృషి చేసిన తెలు గు దేశం పార్టీకి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి పద వి ఇస్తానని పొత్తు ధర్మాన్ని మరిచారం టూ తెలుగుదేశం వర్గీయులు మాజీ స ర్పంచ్ బచ్చల భారతిని పోటీలో నిలి పారు.

ఆమెకు కాంగ్రెస్ పార్టీలోని రెండు ప్రధాన వర్గాలు మద్దతును ప్రకటించాయి. రెండు పర్యాయాలు సర్పంచ్గా పని చేసిన ఆమె అనుభ వం, తమకు కలిసి వస్తుంద ని తుళ్లూరి వర్గీయులు భావిస్తున్నారు. భారతి విజయం కో సం వ్యూహాలకు పదు ను పెడుతుండటంతో ఇక్కడ కాంగ్రెస్ రాజకీయం రెండు పడవల మీద ప్రయా ణంగా మారిందంటున్నారు. 

ఫుట్ బాల్ ఎగిరేనా, బ్యాట్ గెలిచేనా, లేడీపర్స్ గండి కొట్టేనా ?

ప్రస్తుతం సింగారం పంచాయతీలో రాజ కీయ వేడిఎక్కింది. దీంతో పంచాయతీ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. నాయ కుల మధ్య పోరుతో అభ్యర్థుల  ప్రచారం తారస్థాయికి చేరింది. ఉదయం నుండి సా యంత్రం వరకు పోస్టర్లు, ఫ్లెక్సీ లు, ఇంటింటి ప్రచార ర్యాలీలతో హోరెత్తు తోంది. అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సా గుతోంది.

పాయం వెంక టేశ్వర్లు బలపరిచిన మాధవరావు విజ యంతో బ్యాటింగ్ చేస్తారా, లేదా మాజీ ఎమ్మెల్యే ఆశీస్సులతో బరిలో దిగిన గుం డి గౌరీ ఫుట్ బాల్ గుర్తుతో విజయకేతనం ఎగరవేస్తారా, మరోవైపు కాంగ్రెస్ లోని రెండు వర్గాల మద్దతు తో రెండు పర్యా యాలు సర్పంచ్గా పనిచేసిన బచ్చల భా రతికే ప్రజలు మరోసారి ప ట్టం కడతారాపంచాయతీ ప్రజలు ఎవరికి ప ట్టం కడ తారు అనేది ఆసక్తికర రాజకీయ పరిణా మంగా మారింది.

సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా సాగుతున్న సింగా రం పల్లె పొరు, జిల్లాలో ముగ్గురు రాజకీయ వుద్దండల రాజకీయంతో జిల్లాలోనే  అత్యం త ప్రతిష్టాత్మక పోరుగా నిలిచింద ని తెలుస్తుంది. ఎవరిపై ఎవరు పై చేయి సాధించి ఎవరి వర్గీయులు విజయం సాధిస్తారో అనే సమాధానానికి ఎన్నికల ఫలితం వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.