03-12-2024 02:39:52 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరు నాగారం సమీపంలోని చల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగన ఎన్ కౌంటర్ కేసుపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారించింది. మావోయిస్టుల ఎన్ కౌంటర్ వెనుక కుట్ర జరిగిందని, వారి భోజనంలో మతు పదార్థాలు కలిశాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. మల్లయ్య మృతదేహం గురువారం వరకు భద్రపరచాలని, ఎన్ కౌంటర్ పరిణామాలు, పోస్టుమార్టం రిపోర్ట్ ను అదించాలని కోర్టు ఆదేశించింది.
మల్లయ్య మృతదేహం తప్ప మిగిలిన మృదేహాలను మృతుల కుటుంబసభ్యులకు అప్పగించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలను భద్రపరచడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మృతదేహాల పోస్టుమార్టం ప్రక్రియ సరిగ్గా చేయలేదని పిటిషనర్ వాదించారు. ఎన్ హెచ్ఆర్సీ, హైకోర్టు ఆదేశాలతో 8 మంది వైద్యు నిపుణులతో పంచనామా ప్రక్రియ పూర్తి చేశామన్న జీపీ వెల్లడించారు. ఇరుపక్షల వాదనాలు విన్న హైకోర్టు తదుపరి విచారణను గరువారానికి వాయిదా వేసింది.