calender_icon.png 12 November, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుల మధ్య గొడవ.. వ్యక్తి దారుణ హత్య

03-12-2024 03:03:59 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక లావాదేవీల కారణంగా స్నేహితుల మధ్య గొడవ  వ్యాపారి హత్యకు గురైన ఘటన హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.  భాగ్యలత అరుణోదయ కాలనీలో నివసించే కాశి రావు ఒక కార్ల వ్యాపారి. అతను కారులు అమ్మడం కొనడం అతని పని. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు. ఇతనికి శేఖర్ అనే వ్యక్తి స్నేహితుడు. శేఖర్ స్విగ్గి బాయిగా పనిచేస్తున్నాడు. అవసరం నిమిత్తం శేఖర్ కాశిరావు దగ్గర నాలుగు లక్షలు అప్పు తీసుకున్నాడు. 

4 లక్షలు తిరిగి ఇచ్చే నేపథ్యంలో వీరి మధ్య గొడవ జరిగింది .దీంతో శేఖర్ అనే వ్యక్తి కాశీరావ్ ను గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కాశీరావును తన భార్య సుమతి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసిం.ది అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వీరి మధ్య డబ్బు విషయంలోనే గొడవ జరిగిందా లేక మరే దైనా విషయంలో గొడవ జరిగిందా. ఈ హత్యకు ఇంకా ఎవరైనా సహకారం అందించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు.