calender_icon.png 12 November, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు

03-12-2024 12:49:45 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన తెలంగాణ యూత్ డే సదస్సుకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో విద్య,  యువత విషయంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. విద్య, వైద్యం కోసం దానం విపరీతంగా ఖర్చు చేయాల్సివచ్చిందని, కొన్ని ఆసుపత్రులు అయితే రోగులను నిలువుదోపిడి చేస్తున్నాయని ఆరోపించారు. సరైన శిక్షణ లేకపోవడం వల్ల యువత పెడదారి పడుతున్నారు. గొప్ప గొప్ప ఆసుపత్రులు కట్టడం కాదు.. ఆసుపత్రుల అవసరంలేని పరిస్థితి తేవాలని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, బాధ్యతారాహిత్యంగా పరిపాలన సాగించారని మంత్రి జూపల్లి ఆరోపించారు.