31 August, 2026 | 5:53 PM

Breaking News

మంత్రిపదవులపై తెలంగాణ ఆశలు

09-06-2024 12:57 AM
  • తమ వంతుగా 8 సీట్లు ఇచ్చామన్న సంతృప్తిలో టీ బీజేపీ

మరోవైపు పార్టీని మరింత పటిష్టం చేయడంపై దృష్టి

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): నరేంద్రమోదీని తమ నాయకుడిగా ఎన్డీయే కూటమిలోని 293 సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మూడోసారి ఆయన ప్రధానిగా బాధ్యతలను ఆదివారం చేపట్ట నున్నా రు. మోదీ మరోసారి ప్రధానిగా బా ధ్యతలు చేపడుతున్న వేళ తెలంగాణలో బీజేపీ నేత లు, కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. గతంతో పోలిస్తే బీజేపీకి పార్ల మెంట్ సీట్లు తగ్గాయి. 272 మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది. అయినా 240 సీట్లతో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించి తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.

ఈ నేపథ్యంలో 240 సీట్లలో తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లు తాము మోదీకి కానుకగా ఇచ్చామని బీజేపీ నేతలు అంటున్నారు. 2019లో 303 సీట్ల తో సొంతంగా ప్రభు త్వం ఏర్పాటు చేసే స్థితి లో ఉన్న పార్టీ ఇప్పు డు తన మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఉత్తరాదిలో సీట్లు తగ్గినా దక్షిణాదిలో సీట్లు పెరిగాయని, అందులో తెలంగాణలో రెట్టిం పు సీట్లు సాధించామని పార్టీ నేతలు చెబుతున్నారు. మోదీ మరోసారి ప్రధాని అయ్యేందుకు గాను తమ వంతుగా 8 సీట్లు ఇచ్చామన్న సంతృప్తిలో తెలంగాణ బీజేపీ నేతలున్నారు. 

సీనియారిటీకి ప్రియారిటీ..

రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు సాధించడంతో బీజేపీ ఎంపీలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. పదవి కోసం లాబీయింగ్ చేయబోమంటూ కొందరు, కేంద్ర క్యాబినెట్‌లోకి వెళ్తే తన నియోజకవర్గానికి దూరం అవ్వాల్సి వస్తుందని మరొకరు, తనకు పార్టీ ఏ బాధ్యతలను అప్పగించినా ఫర్వాలేదని ఇంకో ఎంపీ చెబుతున్నారు. కానీ, వాస్తవానికి పదవి వస్తే వద్దనే వారు ఎవరూ ఉం డరనే చర్చ జరుగుతోంది. పదవి కోసం పాకులాడమని చెబుతున్నా ఎలాగైన మంత్రి పదవిని పట్టాలనే ఆలోచన వారిలో కనిపిస్తోంది. రెండోసారి ఎంపీలైన వారికి క్యాబినె ట్‌లో ముందు తమకే ప్రాధాన్యం లభిస్తుందని ఆశిస్తున్నారు.

కిషన్‌రెడ్డి, బండి సంజ య్, ధర్మపురి అర్వింద్ రెండోసారి ఎంపీలుగా గెలుపొందారు. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్ సైతం రెండోసారి ఎంపీలుగా గెలిచినా మొదటిసారి వేరే పార్టీ నుంచి ప్రాతిని ధ్యం వహించారు. డీకే అరుణ, ఈటల రాజేందర్ తొలిసారిగా ఎంపీలుగా గెలిచినా అప్పటికే వారికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. డీకే అరుణ రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఈటల సైతం మంత్రి గా విశేష అనుభవం ఉన్న వ్యక్తి. అరుణ మహిళా కోటాలో అవకాశం కోసం ప్రయత్నిస్తుండగా, ఈటల బీసీ నేతగా తనకు బెర్త్ లభిస్తుందని అంచనా వేసుకుంటున్నారు. 

తెలంగాణలో భవిష్యత్తు మాదే.. 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సమానంగా తమకూ సీట్లు రావడంతో బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శి స్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కావడంలేదని, ఆ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అని విమర్శలు చేస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలతో వారికి వారే రేవంత్ సర్కారును కూల్చేస్తారని ఎద్దేవా చేస్తున్నారు. కిషన్‌రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాము రేవంత్ సర్కారు పూర్తి కాలం ఉండాలని కోరుకుంటున్నట్లుగా కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదనీ అంటున్నారు. అయితే తెలం గాణలో భవిష్యత్తు అంతా తమదేనని ఆ పార్టీ ముఖ్య నేతలంతా చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాం గ్రెస్ పార్టీకి తామే ప్రత్యమ్నాయమని, 2028లో తెలంగాణలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే అంశంపై పార్టీ నేతలు దృష్టి సారిస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి తద్వారా గ్రామాల్లోనూ బలంగా ఉన్నామని నిరూపించుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ అంశంపై త్వరలోనే కసరత్తు చేపట్టేందుకు నిర్ణయించారని సమాచారం.