25 March, 2026 | 6:14 AM

జాతీయ లోక్‌అదాలత్ కేసుల పరిష్కారంలో తెలంగాణే టాప్

29-10-2024 01:52 AM

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సెప్టెంబరు రెండోవారం లో జరిగిన లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. తెలంగాణలో మొత్తం 6.41 లక్షల కేసులు పరిష్కారమైనట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి సోమవారం ప్రకటన విడుదల చేశారు. 230 లోక్‌అదాలత్  బెంచ్‌లు ఈ కేసులను పరిష్కరించాయని చెప్పారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజయ్‌పాల్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు తెలిపారు.