సోనియా గాంధీకి పోస్ట్ కార్డులు పంపనున్న తెలంగాణ జాగృతి
సోనియాగాంధీకి పోస్టు కార్డులు..
పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించనున్న కవిత
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇస్తామన్న సంక్షేమ పథకాలపై తెలంగాణ జాగృతి(Telangana Jagruthi ) ఆందోళనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీకి(Sonia Gandhi) పోస్టు కార్డులు పంపాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాగృతి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోస్టు కార్డులు పంపనుంది. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న హామీ నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్నారు. చేయూత పింఛన్లు పెంచాలని తెలంగాణ జాగృతి పోస్టు కార్డులు పంచనుంది. అబిడ్స్ జీపీవో వద్ద ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha Kalvakuntla) పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు.






