14 April, 2026 | 5:14 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

రైతుభరోసా డబ్బులివ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కొడుకు

25-06-2025 09:40 AM

హైదరాబాద్: మెదక్ జిల్లా(Medak district) హవేలీఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో(Aurangabad Thanda) అమానుషఘటన చోటుచేసుకుంది. రైతు భరోసా డబ్బులివ్వలేదని కుమారుడు తండ్రి నాలుక కోసేశాడు. తండ్రి బానోత్ కీర్యా ఖాతాలో రూ. 9 వేలు రైతు భరోసా నగదు జమ అయింది. వైద్య ఖర్చులకు తండ్రి కీర్యా రూ. 5 వేలు తన దగ్గర ఉంచుకున్నాడు. రైతు భరోసా నగదులో మిగిలిన రూ. 4 వేలను కొడుకుకు ఇచ్చేశాడు. రైతు భరోసా నగదు మొత్తం ఇవ్వాలని తండ్రి కీర్యాతో కొడుకు సంతోష్ గొడవకు దిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను తండ్రిని కొట్టడమే కాకుండా గొడ్డలితో నాలుక కోసేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కీర్యాను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.