21 July, 2026 | 9:34 AM

ఉద్యమంలా 'తెలంగాణ జలసిరి' కార్యక్రమం చేపట్టాలి

20-07-2026 09:48 PM

- జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్,(విజయ క్రాంతి): ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ జలసిరి' కార్యక్రమాన్ని ఉద్యమంలా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జలసిరి పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  వీబీజీ రామ్ జీ పథకం కింద గ్రామాల్లో ఇంకుడుగుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. రానున్న రోజుల్లో నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పరిరక్షించాలని అన్నారు.