23-11-2025 02:53:36 PM
హైదరాబాద్: తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపుల హ్యాకింగ్ కలకలం రేపుతోంది. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ ను షేర్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తూ మంత్రులకు ఎస్బీఐ పేరుతో మెసేజ్ లు పంపిస్తున్నట్లు సమాచారం. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. పలువురు మీడియా సంబంధిత గ్రూపులు, మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంవో గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూప్ కూడా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూప్ ల హ్యాక్ అముతున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వాట్సాప్ గ్రూప్ ల హ్యాకింగ్ పై అప్రమాతంగా ఉండాలని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పలుమార్లు సూచనలు జారీ చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దంటూ జర్నలిస్టుల్ని హెచ్చరిస్తున్నారు.