calender_icon.png 13 November, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిన్నెరసానిలో ఐటీడీఏ 7 జోనల్ స్థాయి గిరిజన క్రీడలకు ఏర్పాట్లు పూర్తి

13-11-2025 12:00:00 AM

క్రీడా మైదానాన్ని పరిశీలించిన ట్రైబల్ 

వెల్ఫేర్ జిల్లా క్రీడా అధికారి బి.గోపాల్ రావు

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 12 ,(విజయక్రాంతి,) ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఐఏఎస్ ఆదేశానుసారంగా ఈ నెల 18,19 తేదీలలో ప్రభుత్వ ఆదర్శ క్రీడా పాఠశాల కిన్నెరసానిలో భద్రాచలం ఐటిడిఏ 7 జోన్ల స్థాయి లీగ్ పోటీలు, ఎంపికల గిరిజన క్రీడలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఈరోజు క్రీడా పాఠశాల ప్రాంగణంలో అన్ని క్రీడలకు సంబంధించిన వాలీబాల్, కబడ్డీ,ఖో-ఖో,టెన్నికోయిట్, విలువిద్య మైదానం , 400 మీటర్ల పరుగు పందెం , బాల బాలికల కోసం వాలీబాల్,కబడ్డీ,ఖో-ఖో, విలువిద్య,అథ్లెటిక్స్,చేస్ టెన్నికోయిట్,క్యారమ్స్ ఆట స్థలాలు సిద్ధం చేశారు.

ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 3, 4, 5 తేదీలలో వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటిడిఏ పరిధిలో జరగనున్న రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో క్రీడల అధికారి బొల్లి గోపాల్ రావు, ఎ.ఎస్.ఓ లు కొమరం వెంకనారాయణ,సోయం నాగేశ్వరరావు, బండరాంబాబు, ప్రధానోపాధ్యాయులు యన్.చందు, పి డి ఎస్..బాలసుబ్రమణ్యం పి..రాంబాబు, ఐ.గోపాలరావు, బి. మోతిలాల్,వి. ముత్తయ్య, వీరభద్రం,అంజి,కోచ్లు వాసు,ప్రసాద్ పాల్గొన్నారు.