13-02-2026 03:56:40 PM
క్యాతనపల్లి (మందమర్రి), ఫిబ్రవరి 13 : మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు 113 మంది కౌన్సిలర్ లుగా విజయం సాధించేందుకు పోటీ పడ్డారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 22 మంది, బీఆర్ఎస్ నుంచి 15, బీజేపీ నుంచి 22, బీఎస్పీ నుంచి ఇద్దరు, ఏఐఎంఎం నుంచి రెండు, సీపీఎం నుంచి ఇద్దరు, ఏఐఎఫ్బీ నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఏడుగురు, జనసేన నుంచి నలుగురు, ఇండిపెండెంట్లు 35 మంది అభ్యర్థులుండగా శుక్ర వారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ లో గల సూపర్ బజార్ ఏరియాలోని ఆర్.కె.సి.ఓ.ఎ. క్లబ్ లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో 22 వార్డులకు 22 టేబుల్స్ ఏర్పాటు చేసి రౌండ్ కి వెయ్యి ఓట్ల చొప్పున అదనపు సిబ్బందితో కలిపి 24 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 48 మంది కౌంటింగ్ సహాయకులు కలిసి రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించారు.
విజయం సాధించిన కౌన్సిలర్లు వీరే...
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో మొదటి వార్డు కౌన్సిలర్ గా కాసగోని సాంబయ్య (సీపీఐ), రెండవ వార్డు కౌన్సిలర్ గా పుల్లూరు తిరుమల (కాంగ్రెస్), మూడవ వార్డు కౌన్సిలర్ గా మంతెన మల్లయ్య (కాంగ్రెస్), నాలుగవ వార్డు కౌన్సిలర్ గా జంజీపల్లి మంజుల శశికుమార్ (బీఆర్ఎస్), ఐదవ వార్డు కౌన్సిలర్ గా దాముక శిరీష రమేష్ (కాంగ్రెస్), ఆరవ వార్డు కౌన్సిలర్ గా మద్దెల శంకర్ (సీపీఐ), ఏడవ వార్డు కౌన్సిలర్ గా గుర్రం శ్రీనివాస్ (స్వతంత్ర, కాంగ్రెస్ రెబల్), ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ గా ముని (సీపీఐ), తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ గా బీమా మల్లేష్ (కాంగ్రెస్), పదవ వార్డు కౌన్సిలర్ గా వీణవంక శ్రీనివాస్ (బీఆర్ఎస్), 11వ వార్డు కౌన్సిలర్ గా బొమ్మ భూమా గౌడ్ (బీఆర్ఎస్), 12వ వార్డు కౌన్సిలర్ గా గోపతి భాగ్య రాజయ్య (కాంగ్రెస్), 13వ వార్డు కౌన్సిలర్ గా జే మంజుల (బీఆర్ఎస్), 14వ వార్డు కౌన్సిలర్ గా నాగుల రాజశేఖర్ (బీఆర్ఎస్), 15వ వార్డు కౌన్సిలర్ గా ఆర్నె సంధ్యారాణి సతీష్ (బీఆర్ఎస్), 16వ వార్డు కౌన్సిలర్ గా గండమాల కృపానందం (నాని) (బీఆర్ఎస్), 17వ వార్డు కౌన్సిలర్ గా గొడిసెల సంధ్యారాణి రాజారమేష్ (బీఆర్ఎస్), 18వ వార్డు కౌన్సిలర్ గా పల్లె శ్రీదేవి (కాంగ్రెస్), 19వ వార్డు కౌన్సిలర్ గా రంగరాజు లక్ష్మీ (బీఆర్ఎస్), 20వ వార్డు కౌన్సిలర్ గా కొత్తూరు ప్రభాకర్ (కాంగ్రెస్), 21వ వార్డు కౌన్సిలర్ గా బబ్బెర స్వర్ణలత (బీఆర్ఎస్), 22వ వార్డు కౌన్సిలర్ గా మిట్టపల్లి సరిత శ్రీనివాస్ (సీపీఐ) విజయం సాధించారు. మున్సిపాలిటీలోని 22 వార్డులకు కాంగ్రెస్ నుంచి 22 మంది పోటీ పడగా ఏడుగురు కౌన్సిలర్లుగా విజయం సాధించగా, బీఆర్ఎస్ నుంచి 15కి పది మంది, సీపీఐ నుంచి ఏడుగురికి నలుగురు, ఇండిపెండెంట్లు 35 మందిలో ఒకరు కౌన్సిలర్ గా గెలుపొందారు. బీజేపీ, బీఎస్పీ, ఏఐఎంఎం, సీపీఎం, ఏఐఎఫ్బీ, జనసేన నుంచి ఒక్కరు కూడా విజయం సాధించలేదు. అలాగే ఇండిపెండెంట్లు 34 మంది ఓటమిపాలయ్యారు.