calender_icon.png 13 February, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ దే లక్షెట్టిపేట మున్సిపాలిటీ

13-02-2026 03:54:36 PM

లక్షెట్టిపేట, ఫిబ్రవరి 13 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు 40 మంది అభ్యర్థులు కౌన్సిలర్ పదవీ కోసం పోటీ పడ్డారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 15 మంది, బీఆర్ఎస్ నుంచి 14, బీజేపీ నుంచి 14, బీఎస్పీ నుంచి ఇద్దరు, ఏఐఎంఎం నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు, జనసేన నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్లు 11 మంది అభ్యర్థులు పోటీపడగా శుక్ర వారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో  ఎనిమిది టేబుల్స్ ఏర్పాటు చేసి అదనపు సిబ్బందితో కలిపి తొమ్మిది మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 18 మంది కౌంటింగ్ సహాయకులు రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించారు. ఓట్లలెక్కింపు అనంతరం లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ దక్కించుకుంది.

విజయం సాధించిన కౌన్సిలర్లు వీరే...

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులలో మొదటి వార్డు కౌన్సిలర్ గా బుద్దె సిద్దార్థ్ (బీజేపీ), రెండవ వార్డు కౌన్సిలర్ గా దొంతు అంజలి నర్సయ్య (కాంగ్రెస్), మూడవ వార్డు కౌన్సిలర్ గా పెట్టం తిరుపతి (బీఆర్ఎస్), నాలుగవ వార్డు కౌన్సిలర్ గా మోత్కూరి రాజేశ్వరి వెంకటేష్ గౌడ్ (కాంగ్రెస్), ఐదవ వార్డు కౌన్సిలర్ గా శనిగారపు చిన్నయ్య (కాంగ్రెస్), ఆరవ వార్డు కౌన్సిలర్ గా తోట సువర్ణ (కాంగ్రెస్), ఏడవ వార్డు కౌన్సిలర్ గా బోడ రాజేంద్ర ప్రసాద్ (కాంగ్రెస్), ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ గా రాంనేని జమున (బీఆర్ఎస్), తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ గా ఒడ్డెపల్లి రాజలింగు (కాంగ్రెస్), పదవ వార్డు కౌన్సిలర్ గా పెండెం పద్మ రాజు (కాంగ్రెస్), 11వ వార్డు కౌన్సిలర్ గా సూరం చంద్రమౌళి (కాంగ్రెస్), 12వ వార్డు కౌన్సిలర్ గా ఆరీఫ్ (కాంగ్రెస్), 13వ వార్డు కౌన్సిలర్ గా బిరుదుల సత్యనారాయణ (కాంగ్రెస్), 14వ వార్డు కౌన్సిలర్ గా మైలారపు సుధాకర్ (బీఆర్ఎస్), 15వ వార్డు కౌన్సిలర్ గా గోప సుజాత రమేష్ (కాంగ్రెస్)లు విజయం సాధించారు. మున్సిపాలిటీలోని 15 వార్డులకు కాంగ్రెస్ నుంచి 15 మంది పోటీ పడగా 11 కౌన్సిలర్లుగా విజయం సాధించగా, బీఆర్ఎస్ నుంచి 14 మందికి ముగ్గురు, బీజేపీ నుంచి 14 మందికి ఒకరు గెలుపొందగా బీఎస్పీ, ఏఐఎంఎం, సీపీఎం, జనసేన, ఇండిపెండెంట్లు 11 మందిలో ఒక్కరు విజయం సాధించలేదు.