18-09-2025 01:12:51 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న వేల్పూర్ అశోక్ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన స్వచ్ఛ తాను ఆఫ్ మారతాన్ మా రతాన్ కు తెలంగాణ నుండి గుగ్గిల అశోక్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యారు. తెలంగాణకే గర్వకారణం గా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన వాడు కావడం గర్వకారణం అని గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి ఆర్టీవో కార్యాలయంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ ను కార్యాలయ ఉద్యోగులు అభినందించారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తెలంగాణ కీర్తిని చాటాలని వారు కోరుకున్నారు.