calender_icon.png 18 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ

18-09-2025 01:12:34 AM

  1. విశ్వకర్మ యజ్ఞంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు 

విశ్వకర్మలను సన్మానించిన బిజెపి నాయకులు 

గజ్వేల్, సెప్టెంబర్ 17: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి గుట్టపై బుధవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట తో పాటు విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

వేకువ జమున 3 గంటల నుండి వీరబ్రహ్మేంద్రస్వామి బాలాలయం వద్ద గణపతి పూజ స్వస్తి పుణ్యవచనము, గణపతి, నవగ్రహ హోమం,  వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు ఎన్సీ రాజమౌళి, గాడి పల్లి భాస్కర్, మాది ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

విశ్వకర్మలను బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ చారి, మనుమయ సంఘం అధ్యక్షులు గడియారం వెంకటాచారి మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు దేవతలతో సహ అన్నింటిని సృష్టించారని ప్రతమ్మ దేవుడు విశ్వకర్మ భగవానుడేనని అన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలోని బ్రహ్మంగారి గుట్టపై బాలాలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడంతోపాటు,

అందరి సహకారంతో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామన్నారు. భవిష్యత్తులో బ్రహ్మంగారి ఆలయాన్ని మరింత ఉన్నతంగా నిర్మించడానికి నిత్యం దాతల సహకారంతో కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు కొక్కొండ శ్రీనివాసాచారి,

ఉపాధ్యక్షుడు అరుణోజు లక్ష్మణాచారి, ఉపాధ్యక్షుడు గడియారం స్వామి చారి, కోశాధికారి గడియారం నాగరాజు చారి, ప్రచార కార్యదర్శి అరుణోజు శ్రీనివాసచారి, భాస్కరచారి, మన్మయ సంఘం అధ్యక్షుడు గడియారం వెంకటాచారి, ఉపాధ్యక్షుడు గడియారం వెంకటేశం చారీ, ప్రధాన కార్యదర్శి విఠలాచారి, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.