18-09-2025 01:14:22 AM
పోలీసుల అదుపులో వ్యక్తి..గంజాయి స్వాధీనం
మనోహరాబాద్, సెప్టెంబర్ 17 :మెదక్ జిల్లా ప్రోహిబిషన్ ఎక్సజ్ అధికారి డిపిఈవో ఆదేశాల మేరకు మనోహరాబాద్ పా రిశ్రామిక ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వ్యక్తులపై నిఘా ఏర్పా టు చేయాలని ఆదేశాలు జారీ చేయగా వారి ఆదేశానుసారం ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ సీ ఐ,
వారి సిబ్బందితో కలసి మనోహరాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి అనుమానస్పద వ్యక్తులను విచారించగా కావేరి పైప్స్ కంపెనీ ప్రక్కన ఎస్ ఎస్ ఏ ఎఫ్. కోల్ స్టోర్ కంపెనీ నందు బీహార్ రాష్ట్రానికి చెందిన ముకేశ్ కుమార్ మండల్ అనే వ్యక్తి కూలీ పని ముసుగులో మనోహరాబాద్ చు ట్టుప్రక్కల గ్రామాల యువకులకు గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు.
అతని గదిని తనిఖీ చేయగా ఆ వ్యక్తి వద్ద నల్లటి సం చిలో ఒక కిలో 350 గ్రాముల గంజాయి ల భించింది. సదరు వ్యక్తి అదుపులోకి తీసుకుని ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం కేసు న మోదు చేసి అతని మొబైల్ ఫోన్ ని సీజ్ చే శారు.
తదుపరి విచారణ నిమిత్తం ఎస్ హెచ్ ఓ నర్సాపూర్ కు అప్పగిస్తున్నట్లు అధికారు లు తెలిపారు. ఈసందర్భంగా ఎక్సయిజ్ టా స్క్ఫోర్స్ సీఐ గోపాల్ మాట్లాడుతూ అక్రమంగా మత్తు పదార్థాలు కల్గివున్నా విక్ర యాలు చేసిన సేవించిన వారి వివరాలు త మకు తెలిపాలని ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దాడులలో ఎస్త్స్ర బాలయ్య, హెడ్ కానిస్టేబుల్ చెంద్రయ్య, కానిస్టేబుల్స్ రాజు, నరేష్, రవి, హరీష్ లు పాల్గొన్నారు.