calender_icon.png 22 October, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగలు నాకు ముఖ్యం కాదు

22-10-2025 12:00:00 AM

నియోజవర్గ ప్రజలు, కార్యకర్తలే ముఖ్యం

మాజీ ఎమ్మెల్యే సురేందర్

ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి) :  పండగలు ముఖ్యం కాదు పార్టీ కార్యకర్తలు ప్రజల సంరక్షణ నే దేయం అని మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి మండలంలో సాతెల్లి గ్రామ బిఆర్‌ఎస్ కార్యకర్త పసుపుల దుర్గయ్య సతీమణి పసుపుల పద్మ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు.స్థానిక నాయకులు, స్థానికులచే సమాచారం అందిన వెంటనే,మాజీ ఎమ్మెల్యే జాజాలా సురేందర్, దీపావళి పండగను సైతం లెక్కచేయకుండా బాధలో ఉన్న కార్యకర్త ను ఓదార్చాడానికి, హైదారాబాద్ నుండి ఆ గ్రామానికి, చేరుకొని అంత్యక్రియలో పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్.

శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, అండగా తానున్నానని భరోసా ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే వెంట మండల బిఆర్‌ఎస్,అధ్యక్షులు,జలంధర్ రెడ్డి ,పట్టణ అధ్యక్షులు,ఆదిములం సతీష్,ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం, అధ్యక్షులు ఎగుల నర్సింలు,నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు .