calender_icon.png 1 October, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సదరు ఉత్సవ సమితి

01-10-2025 02:07:07 AM

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎడ్ల హరిబాబు యాదవ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర సదరు ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ముషీరాబాద్ కు చెందిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నియామకాన్ని ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ యాద వ్, యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్ లు ప్రకటించారు.

మంగళవారం ముషీరాబాద్ లోని యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఎడ్ల హరిబాబు యాదవ్ మాట్లాడుతూ... సదరు ఉత్సవాలు అక్టోబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగనున్నాయని తెలిపారు. సదరు వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సదరును రాష్ట్ర పండుగగా గుర్తించడం అభినందనీయం అన్నారు.

సదరు ఉత్సవాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యాదవులను ఏకతాటిపైకి తీసుకువచ్చి విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాలలో మరింత రాణించే విధంగా తమ వంతు కృషిచేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి కమిటీలో పదవీ బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.