calender_icon.png 1 October, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2 నుంచి ఆర్డీ ఇంజినీరింగ్ సైనిక్ స్కూల్ అలుమ్ని గోల్ఫ్ టోర్నమెంట్

01-10-2025 02:05:58 AM

స్టాల్వరట్స్ గోల్ఫ్ డైరెక్టర్ డీ.వీ సింగ్

ఖైరతాబాద్, సెప్టెంబర్ 30(విజయ క్రాంతి) : ప్రతిష్ఠాత్మక ఆర్డీ ఇంజినీరింగ్ ఇం టర్ సైనిక్ స్కూల్స్ అలుమ్నీ గోల్ఫ్ టోర్నమెంట్ ఈ నెల 2 నుంచి 4వరకు హైదరా బాద్ లోని బోల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్లో ప్రారంభించనున్నట్టు స్టాల్వరట్స్ గోల్ఫ్ డైరెక్టర్, రిటైర్డ్ బ్రిగేడియర్ డి.వి.సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్డి ఇంజనీరింగ్ సైనిక్ స్కూల్ ప్రతినిధి  వై.వి.ప్రసాద్‌తో కలిసి మాట్లాడారు.... మూ డు రోజులపాటు జరిగే ఈ టోర్నమెం ట్లో మూడు విభాగాల్లో వ్యక్తిగత పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్ల నుంచి వచ్చిన అలుమ్నీ (పూర్వ విద్యార్థులు)  పాల్గొంటారని తెలిపారు. ప్రతి స్కూల్ నుంచి ఐదు ఉత్తమ స్టేబిల్ ఫోర్డ్ స్కోర్ల  సమష్టి ఆధారంగా చాంపియన్షిప్ విజేతను నిర్ణయి స్తారని తెలిపారు. ఇలాంటి ఇతర కార్యక్రమాల ద్వారా సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థు ల బలమైన ఉత్సాహభరితమైన నెట్వర్క్ ను సృష్టించడమే తమ లక్ష్యం అని తెలిపారు.