27 July, 2026 | 9:58 AM

తెలంగాణ షాన్ హైదరాబాద్

30-05-2024 01:24 PM

హైదరాబాద్: తెలంగాణ షాన్ హైదరాబాద్.. హైదరాబాద్ ప్రతీక చార్మినార్ అని కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే దాని ప్రతీక చార్మినార్ అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. తెలంగాణ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వీటిని ఇప్పుడు తీసేయాల్సిన అవరసం, అర్జెన్సీ ఏమీ వచ్చిందని ప్రశ్నించారు.ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న కేటీఆర్, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే తెలంగాణవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.  ప్రభుత్వం ఇప్పటికైనా తన మూర్ఖపు వైఖరి మానుకోవాలని కోరుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.