తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా
30-05-2024 02:18 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. రాష్ట్ర అధికార చిహ్నంపై మరింత సంప్రదింపులు జరపాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. జూన్ 2న అధికారగీతం మాత్రమే ఆవిష్కరించనున్నట్లు గురువారం ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ తల్లి, రాష్ట్ర చిహ్నం మార్పుపై స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది. 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్చల తర్వాతే అధికార చిహ్నం ఖరారు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కాకతీయ కళా తోరణం, చార్మినార్ తొలగింపు పై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు.






