27 July, 2026 | 10:48 AM

ముంపు సమస్య పరిష్కరిస్తా..

30-05-2024 02:09 AM

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్, మే 29: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ముంపు ప్రాం తాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. వానాకాలంలో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవా రం హయత్‌నగర్ డివిజన్‌లోని హై కోర్టు కాలనీ, బీడీఎల్ కాలనీల్లో పర్యటించారు. వానకాలం వస్తే ఎగువ ప్రాంతాల్లోని వరద కాలనీ ల మీదు గా వెళ్తుండడంతో ఇండ్లలోకి నీరు చేరుతుందని, వీధుల్లోకి మోకాలు లోతు నీరు చేరుతుందని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

వరద ముంపు ప్రాంతాల్లో గతంలోనే నివారణ చర్యలు తీసుకున్నామని, ట్రంక్‌లైన్, నాలా నిర్మాణాలను ప్రారంభించామని గుర్తు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆయా నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. హైకోర్టు, బీడీఎల్ కాలనీల్లో ట్రంక్‌లైన్ నిర్మాణం కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి స్థలం సేకరించాల్సి రావడంతో పనులు నిలిచిపోయాయని చెప్పారు