దమ్మపేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని గ్రామ పెద్దలు, నాయకుల సమక్షంలో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతీ ఒక్కరు తెలంగాణ తల్లి ఫోటోకు పూలు జల్లి నమస్కరించి జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తదనంతరం మిఠాయిలు ఒకరొకరు తినిపించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. పాలకవర్గ సభ్యులు సిబ్బందికి స్వీట్ బాక్స్ లు పంచారు. తదనంతరం పాలక వర్గ సభ్యులు వివిధ కార్యాలయాల్లో, పాఠశాలల్లో జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వైయస్ఆర్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కక్కిరాల రమేష్, ఎంపీడీవో కార్యాలయంలో రవీందర్ రెడ్డి, ఎమ్మార్వో కార్యాలయంలో రామ్ నరేష్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై రాజేష్ కుమార్, పశువుల ఆసుపత్రిలో డాక్టర్ తేజరాణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ షఫీక్, అటవీ క్షేత్ర కార్యాలయంలో ఎఫ్ఎర్వో శ్రీను, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వాసం రాణి శ్రీను, వ్యవసాయ శాఖ, సొసైటీ కార్యాలయంలో ఎల్లిన రాఘవరావు, డీసీసీ బ్యాంక్ లో రూపవతి, జీసీసీ కార్యాలయంలో బి.వెంకటేశ్వరరావు తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.






