25 April, 2026 | 10:49 AM

రేపు టెన్త్ ఫలితాలు

29-04-2024 12:05 AM

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి ఈనెల 2 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 2,57,952 మంది అబ్బాయిలు, 2,50,433 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈనెల 4 నుంచి ప్రారంభించి 20 నాటికి మూల్యాంకనం పూర్తి చేశారు. ఆ తర్వాత డీ కోడింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసిన అధికారులు ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.