మే 7 తర్వాత సీబీఎస్‌ఈ ఫలితాలు!
29-04-2024 12:05 AM
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్‌ఈ) టెన్త్, 12వ తరగతి పరీక్ష ఫలితాలను మే 7 తర్వాత విడుదల చేయనున్నట్లు సమాచారం. గతేడాది మే 12న ఫలితాలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈసారి తొందరగా ఫలితాలను విడుదల చేసేందుకు సీబీఎస్‌ఈ బోర్డు కసరత్తు చేస్తోంది. మే రెండో వారంలో ఎప్పుడైనా ఫలితాలు వెలువడనున్నాయి. ముందుగా పదో తరగతి ఫలితాలు, ఆ తర్వాత 12వ తరగతి ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది సీబీఎస్‌సీ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు జరిగితే, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా హాజరయ్యారు.






