ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
ఘట్ కేసర్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి, అంకుషాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్లో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు తల్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి తెలుగు భాష గొప్పతనాన్ని చాటారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి నులు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు. భారత క్రీడా రంగానికి మేజర్ ధ్యాన్ చంద్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలుగు భాష ప్రపంచంలోనే గొప్ప భాషల్లో ఒకటని, తె లుగు సాహి త్యం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, క్రీడా విభాగం, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.






