15 June, 2026 | 7:38 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ఆకాశవాణిలో తెలుగు పద్మాలు

05-07-2024 01:26 AM

పద్మ పురస్కార గ్రహీతల పరిచయ కార్యక్రమం

నేటి నుంచి ప్రారంభం కానున్న ధారావాహిక

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార సేవలో 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలుగు పద్మాలు శీర్షికతో ప్రత్యేక కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రసారం చేయనుంది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించి భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న ప్రముఖుల పరిచయాలతో కూర్చిన ధారావా హిక ఈనెల 5 నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుందని స్టేషన్ డైరెక్టర్ విష్ణుభట్ల ఉదయ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి వినవచ్చునని వెల్లడించారు.