22 August, 2026 | 3:51 PM

Breaking News

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి   •   మైనారిటీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్   •   జవాబుదారితనంతో విధులు నిర్వహించాలి   •   సెయింట్ జాన్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్ రూపా రెడ్డికి శ్రద్ధాంజలి   •   కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యమాలకు సిద్ధం కావాలి   •   చెట్టు కిందే తరగతులు.. కళాశాలలో వసతిగృహం నిర్వహణ   •   పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి   •   ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

తెలుగునాట పట్టుదలగా..

17-01-2025 12:23 AM

స్టార్ హీరో అజిత్‌కుమార్ ప్రస్తుతం కార్ రేసింగ్ పోటీల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లో ఆయన జట్టు మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నటుడిగానే కాకుండా రేసర్‌గా రాణించిన అజిత్‌పై అందరూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదిలా ఉండగా అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’కి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు మేకర్స్.

ఈ సినిమాను తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్‌ను సైతం విడుదల చేశారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ సైతం సాయంత్రం ఓ ప్రైవేటు టీవీ ఛానల్ వేదికగా లాంచ్ చేశారు.  అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ 62వ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా, త్రిష కథానాయికగా నటిస్తోంది. ‘ఎంత వాడు గాని’ తర్వాత అజిత్-, త్రిష కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్ల భారీ అంచనాలున్నాయి.