22 August, 2026 | 2:53 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

ఆర్‌సీ16 గెటప్

17-01-2025 12:26 AM

సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తనదైన స్టుల్‌తో దూసుకుపోతున్న జగపతిబాబు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘ఆర్‌సీ 16’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం లో ఓ కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు.  ఈ విషయమై ఆయన తాజాగా ‘ఆర్‌సీ 16’ షూటింగ్ కోసం సిద్ధమవుతున్న వీడియోను నెట్టింట షేర్ చేశారు. “చాలా కాలం తర్వాత బుచ్చిబాబు ఆర్‌సీ 16 కోసం పనిపెట్టాడు.

గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది” అని పేర్కొన్నారు. జగపతిబాబుకు మేకప్ వేస్తున్న ఈ వీడియో చూపరులను ఆకట్టుకుంటోంది.  గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది.