గ్రహణం కారణంగా ఆలయం మూసివేత
శ్రీరంగాపురం మార్చి 3: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని తాత్కాలి కంగా మూసివేశారు. గ్రహణ కాలంలో ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం ఆలయ తలుపులు మూసి వేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
గ్రహణం ముగి సిన అనంతరం రాత్రి 8 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, పుణ్యాహవాచనం చేసిన తరువాత ఆలయాన్ని తిరిగి భక్తులకు దర్శనార్థం తెరినట్లు ఆలయ ప్రధా న అర్చకులు విష్ణు నారాయణ వెల్లడించా రు.శాస్త్రోక్త విధానాలతో ఆలయ ప్రాంగణం శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అ నంతరం స్వామివారి దర్శనానికి అనుమతించారని ఆయన తెలిపారు. భక్తులు నిర్ణీత స మయానికి ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగు తారీఖు అనగా బుధవా రం నాడు స్వామివారి రథోత్సవం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు విష్ణు నారా యణ తెలిపారు.




