4 March, 2026 | 2:15 AM

పీఎం కుర్చీ కుటుంబ వారసత్వం కాదు

04-03-2026 12:24 AM
  1. రాహుల్ ప్రధాని కాలేరని సీఎం రేవంత్‌కీ తెలుసు
  2. కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ప్రధానమంత్రి కుర్చీ అనేది కుటుంబ వారసత్వం కాదని, రేవంత్ రెడ్డికి తెలుసు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని, దీంతో భజన ఆపి, సీఎం తన బాధ్యతపై దృష్టి పెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. పీఎం కుర్చీ ఒక చిరునవ్వు, ఒక తలాడింపుతో బహుమతిగా ఇచ్చేది కాదని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సమావే శంలో సంకేతాలు ఇవ్వడం దేశంపై ఒక గ్రహణంలాంటిదేనని విమర్శించారు.

ఈమేరకు మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘ఈ రాహుల్ గ్రహణం’ మూ డు సార్లు భారతాన్ని చీకటిలో ముంచేందుకు ప్రయత్నించిందని, కానీ ప్ర ధాన మంత్రి నరేం ద్ర మోదీ అభివృద్ధి కిరణాలు ప్రతీసారి వెలుగు నిచ్చాయని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యమని, మీ నిజాం శైలి దర్బార్ కాదని తెలిపారు.

ప్రధానమంత్రి పదవికి ఎలాంటి ఖాళీ లేదని, 140 కోట్ల భారతీయు లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒకసారి కాదు, మూడుసార్లు మద్దతు ముద్ర వేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి పేదల ఓట్లతో ఎన్నికవుతాడని, హైదరాబాద్ కోర్టీయర్ల నోట్లతో కాదు అని విమర్శించారు. దేశం అభివృద్ధి రంగులతో హోలీ జరుపుకుంటుంటే, కాంగ్రెస్ మాత్రం అవినీతి మసితో మసకబారిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నవ్వు చూడాలనుకుంటున్నారు.. కానీ ఆయన చూడలేకపో తున్నారని ఎద్దేవా చేశారు.