17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పది పరీక్షలు ఏడాదికి రెండుసార్లు

26-06-2025 12:00 AM
  1. సీబీఎస్‌ఈ బోర్డు కీలక నిర్ణయం
  2. ఫిబ్రవరిలో నిర్వహించే మొదటి విడత తప్పనిసరి
  3. మేలో రాసే రెండో విడత పరీక్షలు ఆప్షనల్
  4. ---  2025-26 విద్యాసంవత్సరం నుంచి అమలు

న్యూఢిల్లీ, జూన్ 25: పదో తరగతి పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025---26 నుంచి ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలో తొలివిడత, మే నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో నిర్వహించే మొదటి విడత పరీక్షలను తప్పనిసరి చేయగా, మేలో నిర్వహించే రెండో విడత పరీక్షలను ఆప్షనల్‌గా పెట్టారు. కొత్త నిబంధనలకు తాజాగా సీబీఎస్‌ఈ ఆమోదం తెలిపింది. 

మొదటి విడతలో నిర్వహించే పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌లో, రెండో విడతలో నిర్వహించే పరీక్షల ఫలితాలను జూన్‌లో విడుదల చేస్తారు. విద్యార్థులపై పడుతున్న చదువుల భారాన్ని, పరీక్షల ఒత్తడిని తగ్గించేందుకు వీలుగా జాతీయ విద్యా విధానం - 2020 పలు కీలక సిఫార్సు చేసింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి, మే నెలల్లో రెండు విడుతల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్‌ఈ పరీక్షల విభాగాధిపతి భరద్వాజ్ వెల్లడించారు.

రెండు విడుతల్లో పరీక్షల నిర్వహణ వల్ల విద్యా ర్థులు మార్కులు మెరుగుపరుచుకొనే అవకాశం ఉంటుందన్నారు. అయితే అంతర్గత మదింపు ఏడాదికి ఒకేసారి ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్‌లలో మూడు సబ్జెక్టులను ఎంచుకొని బెటర్‌మెంట్ కోసం రాసుకోవచ్చని వెల్లడించారు.

చలికాలం ఎక్కువగా ఉండే స్కూళ్లలో ని పదో తరగతి విద్యార్థులకు ఏదో ఒక ఫేజ్‌లో పరీక్షలు రాసే అవకాశం కల్పించా రు. కాగా పది పరీక్షలను రెండు దశల్లో నిర్వహించేందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను సీబీఎస్‌ఈ గతంలోనే వెలువరించింది. ఈ రెండు పరీక్షలను పూర్తిస్థాయి సిలబస్‌తోనే నిర్వహిస్తామని అందులో స్పష్టం చేసింది.