calender_icon.png 10 July, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యశాఖలో 52 పోస్టులకు నోటిఫికేషన్లు

27-06-2025 12:00:00 AM

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, నాలుగు స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు ఉన్నా యి. జూలై 12 నుంచి 26వ తేదీ వరకు స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు, జూలై 14 నుంచి 25 వరకు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గత 18 నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్స్, స్టాఫ్ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తదితర పోస్టులు ఉన్నాయి.

మరో 6 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్లు 1,284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ 1,930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్‌నర్స్) 2,322 తదిత ర పోస్టులు ఉన్నాయి. త్వరలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకూ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది.