11 March, 2026 | 3:41 AM

సింగరేణిలో టెండర్ల దందా!

09-03-2026 12:23 AM

12 శాతం నెగెటివ్ బిడ్‌తో బయటపడ్డ కాంగ్రెస్ అసలు రంగు

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): సింగరేణి ఓవర్ బర్డెన్ (ఓబి) టెండర్లలో రేవంత్‌రెడ్డి సర్కార్ సాగిస్తున్న దోపిడీ బీఆర్‌ఎస్ పోరాటంతో కాంగ్రెస్ గుట్టు రట్టయిం దని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌లో పో స్టు చేశారు. గతంలో సింగరేణిలో ఓబి టెండర్లు పారదర్శకంగా ఆన్‌లైన్‌లో 7 శాతం నుంచి 20 శాతం తక్కువకే పనులు పూర్త య్యి, సంస్థకు వందలాది కోట్లు ఆదా అయ్యేవని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో ఈ దోపిడీకి స్కెచ్ గీశారని ఆరోపించా రు.

’సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధనతో ఎవరెవరు టెండర్ వేస్తున్నారో అధికార పార్టీ నేతలకు ముందుగానే తెలిసిపోతుందని, వా ళ్లని బెదిరించి, పోటీ లేకుండా చేసి, తమకు కావాల్సిన వారికే టెండర్లు దక్కేలా సిండికేట్ ఏర్పాటు చేయడానికి బ్రహ్మాస్త్రంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ సిండికేట్ పు ణ్యమా అని తక్కువకు పోవాల్సిన టెండర్లన్నీ +7 శాతం నుంచి +10 శాతం ఎక్కువకు ఖ రారవుతూ సింగరేణి ఖజానాకు భారీ గండి కొట్టాయని, ఈ 12 శాతం బిడ్ చూశాక..

గతంలో +10 శాతం అదనంగా కోట్ చేస్తూ దక్కించుకున్న టెండర్లలో కమీషన్ల కోసం ఎంత దారుణమైన కుమ్మక్కు జరిగిందో స్పష్టమవుతున్నదని తెలిపారు. కమీషన్ల కక్కుర్తి వల్ల ఓబీ పనుల్లో తీవ్ర జాప్యం జరిగి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పడిపోయిందన్నారు. మరోవైపు బొగ్గు ఉత్పత్తి తగ్గి, సంస్థ లాభాలు పడిపోతుండటంతో.. బొగ్గు గని కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి బోనస్ లాభాల వాటా శాతానికి కోత పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.