calender_icon.png 16 February, 2026 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గూడెం’పై తొలగిన సస్పెన్స్!

16-02-2026 12:00:00 AM

  1. కాంగ్రెస్, సీపీఐ చెరో రెండేళ్లు మేయర్ 
  2. రాష్ట్ర నాయకత్వం ముందు కుదిరిన ఒప్పందం 
  3. తొలగిన 48 గంటల ఉత్కంఠ

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే ఎంతో రసవత్త రంగా మారిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సస్పెన్స్ కు తెరపడింది. కాంగ్రెస్, సిపిఐ పార్టీలు కలిసి పనిచేయాలని రాష్ట్ర నాయకత్వం సూచనతో కొత్తగూడెం మేయర్ పదవిపై నెలకొన్న ఉత్కంఠ తొలగింది. మొదటి రెండున్నర సంవత్సరాలు సిపిఐ అభ్యర్థి మేయర్ గా, మిగిలిన రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ గా పనిచేసేందుకు రెండు రాష్ట్ర పార్టీల నాయకత్వం అంగీకరించారు. డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. దీంతో కథ సుఖాంతమైంది 

ఈనెల 11వ తేదీన జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడం మున్సిపల్ కార్పొరేషన్ లోగల 60 డివిజన్లలో సిపిఐ కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఓటర్ దేవుళ్ళు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా  22 డివిజన్లకే రెండు పార్టీలను పరిమితం చేశాయి . కాంగ్రెస్కు మిత్రపక్షమైన సిపిఎం ఒక స్థానం దక్కించుకోవడంతో కాంగ్రెస్కు 23, సిపిఐ కి 22 కార్పొరేటర్లు ఉన్నారు.

దీంతో మేయర్ పదవి పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం విద్యుతమే. కొత్తగూడెం మేయర్ పదవి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పూర్తి మెజార్టీ  రాకపోవడంతో శుక్రవారం రాత్రి నుంచి రెండు పార్టీల నాయకత్వాలు మేయర్ పదవి కోసం  పావులు కదిపారు. గెలిచిన మేయర్లను రక్షించుకునే  రాజకీయ పక్షాలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు.

సోమవారం మేయర్ పదవి ఎంపిక ఉన్న నేపథ్యంలో ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగారు. ఒకవైపు సిపిఐ తమకు మిత్రపక్షమే అంటూ ఒంటరిగా మేయర్ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్ తెర వెనుక వ్యూహరచనలకు పాల్పడింది. మరోవైపు సిపిఐకి  బిఆర్‌ఎస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ను పరిశీలిస్తూ కాంగ్రెస్ తో సంబంధం లేకుండా మేయర్ పీఠానే దక్కించుకునేందుకు తర్జనభర్జన పడింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగూడెం మేయర్ ఏ పార్టీ పరం అవుతుందని ఆసక్తి నెలకొంది. మేయర్ పీఠం కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 మంది మేయర్లు ఉండాల్సి ఉంది. సిపిఐ సొంతంగా 22, బిఆర్‌ఎస్ 8 మంది కార్పొరేటర్లు మద్దతు ఇస్తే 30 కి చేరుతుంది. ఎమ్మెల్యే ఓటుతో సునాయాసంగా కాంగ్రెస్తో పని లేకుండా మేయర్ స్థానాన్ని దక్కించుకుంటుందని ప్రచారం జోరుగా సాగింది. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కలసి పనిచేస్తున్న, కార్పొరేషన్ ఎన్నికల్లో కత్తులు దూసుకున్నారు.

ఈ క్రమంలో శనివారం రాత్రి హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రులతో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ హంగు అంశంపై చర్చలు నిర్వహించారు. మరో వైపు సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డిలు సిపిఐ పార్టీ తరఫున ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. మేయర్ పీఠాన్ని సిపిఐ కి, డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి కేటాయించేలా రాజీ మంత్రాన్ని ప్రయోగించారు.

అందుకు సీఎం సానుకూలంగా అంగీకరించి మొదటి రెండున్నర సంవత్సరాలు సిపిఐ, మిగిలిన రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ అభ్యర్థి మేయర్గా పనిచేసేందుకు ఆంగీకరించారు. సీఎం అంగీకరాన్ని సిపిఐ రాష్ట్ర కమిటీ సైతం సాను కూలంగా వ్యవహరించడంతో ఇరుపార్టీల మధ్య అంగీకారం కుదిరింది.

ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఆరుగురు కార్పొరేటర్లలో ఒకరు సిపిఐ శిబిరంలోకి, మిగిలిన ఐదుగురు కాంగ్రెస్ శిబిరంలోకి చేరారు. ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు కొత్తగూడెం మేయర్ పదవిపై రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్న ఆటో ప్రకటించారు.

మేయర్ బరిలో నునావత్ శ్యామల దినేష్, మూడ్ గణేష్

కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ అభ్యర్థి రిజర్వు కావడంతో సిపిఐ నుండి పలువురు  ఆశావాహులు మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నారు.అత్యధిక మెజార్టీతో గెలుపొందిన 31 డివిజన్ సిపిఐ కార్పొరేటర్ నోనోవత్ శ్యామల దినేష్ ను మేయర్ పదవికి ఆ పార్టీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాతల నాటి కాలం నుంచి కమ్యూనిస్టు పార్టీకి అనేక సేవలు అందించడం, సామాజిక సేవలో చురుగ్గా పనిచేయడం తదితర విషయాలను దృష్టిలో ఉంచుకొని అధిష్టానం నూనెవత్ శ్యామల దినేష్ కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సుజాతనగర్ 20 డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన మూడ్ గణేష్ సైతం మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సిపిఐ అధిష్టానం పేర్లను పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ సి పై పొత్తులో భాగంగా మేయర్ పీఠాన్ని చేరీ రెండున్నర ఏళ్ళు పంచుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో తొలి విడత అవకాశం సిపిఐ కి దక్కింది. వివాదరహితు డు, సౌమ్యుడు గా పేరు ఉన్న గణేష్ కు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.