25 July, 2026 | 2:41 AM

రేపే టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

27-06-2024 10:09 PM

హైదరాబాద్: రేపు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను bse.telangana.gov.in లో చూసుకోవాలని సూచించారు.

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన వార్షిక పరీక్షలకు మొత్తం 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 30న విడుదదల చేసిన ఫలితాల్లో 91.31 శాతం మంది పాసయ్యారు. బాలికలు 93.23 శాంతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు రేపు విడుదల చేయనున్నారు.