7 July, 2026 | 2:54 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

పదో చిత్రం.. ‘దిల్ రూబా’

20-12-2024 12:00 AM

యువ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి ‘దిల్ రూబా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిసుండగా.. రవి, జోజో జోస్, రాకేశ్‌రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం యూనిక్ స్టుల్, యాటిట్యూడ్‌తో కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ‘హిస్ లవ్, హిస్ యాంగర్..’ అని రాసి ఉన్న వ్యాఖ్యలు కిరణ్ క్యారెక్టర్‌ను తెలియజేస్తున్నాయి. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్; సినిమాటోగ్రఫీ: డానియేల్ విశ్వాస్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్.