3 July, 2026 | 6:19 PM

Breaking News

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన యువనేత ఇలియాస్   •   జిల్లాలో నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది   •   కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •  

మళ్లీ ఉగ్రస్థావరాలు

29-06-2025 02:06 AM
  1. పునర్‌నిర్మిస్తున్న పాకిస్థాన్

ఆపరేషన్ సిందూర్ దాడుల్లో ధ్వంసం అయిన ఉగ్రశిబిరాలు

నిధులు సమకూరుస్తున్న ఐఎస్‌ఐ, పాక్ ఆర్మీ

న్యూఢిల్లీ, జూన్ 28: ఆపరేషన్ సిందూర్ దాడులతో ధ్వంసం అయిన ఉగ్రస్థావరాలను పాక్ పునర్‌నిర్మిస్తోంది. ఈ ఉగ్ర స్థావరాల పునర్‌నిర్మాణం కొరకు ఐఎస్‌ఐతో పాటుగా పాక్ ఆర్మీ నిధులు సమకూ రుస్తున్నట్టు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఈ స్థావరాలు ఎక్కువగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మే 7న ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భా రత దళాలు పాకిస్థాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. 

వైమానిక దాడులు తప్పించుకునేందుకే.. 

బయటి దేశాలు చేసే వైమానిక దాడులను తప్పించుకునేందుకు వీలుగా నియం త్రణ రేఖ సమీపంలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాద శిబిరాలను నిర్మిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. జమ్ము సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న నాలుగు లాంచ్‌ప్యాడ్లను ఐఎస్‌ఐ పునర్‌నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.

జైష్ మహ్మద్, లష్కర్ హిజ్బుల్  ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, ఐఎస్‌ఐకి చెందిన సీనియర్లు భహవల్‌పూర్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వెనుక ది రెసిస్టెన్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) హస్తం ఉంది.