5 July, 2026 | 12:57 PM

అభివృద్ధి దిశగా అందోల్

12-06-2024 12:25 AM

ఎడ్యుకేషన్ హబ్‌గా విద్యారంగం పురోగతి

నర్సింగ్ కాలేజీతో చేరువ కానున్న వృత్తివిద్య

రూ.168 కోట్లతో సింగూర్ కాల్వలకు మెరుగులు

ఆరోగ్య శాఖమంత్రి దామోదర ప్రత్యేక దృష్టి

సంగారెడ్డి, జూన్ ౧౧ (విజయ క్రాంతి): అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కృషి చేస్తున్నారు. అందోల్‌లో నర్సింగ్ కళాశాల మంజూరు చూస్తు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వూ లు జారీ చేసింది. నర్సింగ్ కళాశాలకు రూ. 43 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారి చేశారు. నర్సింగ్ కళాశాలలో 60 సీట్ల సామర్థ్యంతో బీఎస్సీ నర్సింగ్ శిక్షణకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాల  భవనాల నిర్మా ణం, మౌళిక సౌకర్యలు కలిపించేందుకు రూ. 43 కోట్ల మంజూరు చేశారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులో తెలిపారు.

ఎడ్యుకేషన్ హబ్‌గా అందోల్ 

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజకవర్గం ను ఎడ్యుకేషన్ హబ్‌గా ఏర్పాటు చేసేందుకు అధిక ప్రాధాన్యత కలిపిస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుల్తాన్‌పూర్‌లో జేఎన్‌టీయూ ఇంజి నీరింగ్ కళాశాలను మంజూరు చేశారు. మునిపల్లి మండలంలోని బుదేరాలో సాంఘీక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ, పీజీ కళాశాలను ఏర్పాటు చేశారు. నియోకవర్గంలోని అందోల్, పుల్కల్, మునిపల్లి, రాయికోడ్, వట్‌పల్లి మండలంలో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నారు. నర్సింగ్ కళాశాల మంజూరు కావడంతో ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు కలుగుతుంది. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో వేలాది మంది విద్యార్థులు చదవుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా లోనే అధిక గురుకుల పాఠశాలలు అందోల్ నియోజకవర్గంలో ఉన్నాయి.  

కాల్వల మరమ్మతులకు రూ.168 కోట్లు 

మంజీరా నది పై ఉన్న సింగూర్ ప్రాజెక్టు సాగు నీటి కల్వలకు మరమ్మతులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.168.30 కోట్లు మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.  సింగూర్ ప్రాజెక్టు కాల్వలు అందోల్, మునిపల్లి, పుల్కల్, చౌట్కూర్, సదాశివపేట మండలాల్లో ఉన్న సాగునీటి కాలువలకు సీసీ లైనింగ్ పనులు చేసేందుకు నిధులు మంజూ రు చేశారు. సింగూర్ ప్రాజెక్టు నిర్మాణంను హైదరాబాద్ పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాల కోసం నిర్మాణం చేశా రు. ప్రాజెక్టు లో 30 టీఎంసీల నీటి నిల్వ ఉండే సామర్థ్యంతో నిర్మాణం చేశారు. ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రతి ఎకరాని సాగు నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. సాగునీటి కల్వల మరమ్మతులకు నిధులు మంజూరు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.