13 April, 2026 | 4:05 PM

Breaking News

కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •   దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్   •   ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ కు కళాశాలలో ఘనంగా నివాళులు   •  

నేటి నుంచి టెట్

18-06-2025 12:30 AM
  1. 9 రోజులు 16 సెషన్‌లలో పరీక్షలు
  2. -- 1.83 లక్షల మంది అభ్యర్థులు, 66 సెంటర్లు
  3. నేడు, రేపు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పరీక్ష
  4. సుదూర ప్రాంతాల్లో సెంటర్లతో ఇబ్బందులు!

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 (టెట్) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకాను న్నాయి. ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం తొమ్మిది రోజుల్లో 16 సెషన్‌లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 15 జిల్లాల్లో 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1కు 63,261 మం ది, పేపర్-2కు 1,20,392 మంది కలిపి మొ త్తం 1,83,653 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశా రు. షిఫ్ట్-1 ఉదయం 9 గంటల నుంచి 11: 30 గంటల వరకు, షిఫ్-2 మధ్యాహ్నం 2 గం టల నుంచి సాయంత్రం 4:30 గంటల వర కు జరగనుంది. బుధవారం, గురువారం పే పర్-2 అభ్యర్థులకు మ్యాథమెటిక్స్ అండ్ సై న్స్ ఇంగ్లీష్, తెలుగు మీడియం పరీక్ష జరగనుంది.

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, కరీంనగర్, ఖ మ్మం, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నల్లగొండ, నిజామబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా 709370 8883/7093708884 నంబర్లలో సంప్రదించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీటెట్ చైర్‌పర్సన్ డాక్టర్ ఈ .నవీన్ నికోలస్ తెలిపారు. 

దూర ప్రాంతాల్లో సెంటర్లు..

అభ్యర్థులకు టెట్ నిజంగా పరీక్షే అని చెప్పాలి. పరీక్షా కేంద్రాలను సుదూర ప్రాంతాల్లో కేటాయించడంతో అభ్యర్థులు ఆందోళన చెం దుతున్నారు. మరికొంతమంది పరీక్ష రాసేందుకు సుముఖత చూపడంలేదు. ఖమ్మం జిల్లాలకు చెందిన ఓ అభ్యర్థికి నిజామాబాద్‌లో సెంటర్ పడింది.

ఇలా సొంత జిల్లాలకు వం దల కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలను కేటాయించారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సెషన్ ఉన్న వారు ఒక రోజు ముందుగానే పోవాల్సి ఉం టుంది. ప్రయాణ ఛార్జీలు, ఉండడానికి వసతి ఇబ్బందికరంగా మార డంతో పలువురు అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాలా? వద్దా? అని సందిగ్ధంలో పడ్డారు.