13 June, 2026 | 10:47 PM

ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి

13-06-2026 09:30 PM

టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగ రాంబాబు

ఆళ్ళపల్లి: ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు తనే సరఫరా చేయాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి జోగ రాంబాబు, అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో జోగా రాంబాబు ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎంకొమరం లాలయ్య  మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ఈనెల 15 నుండి ప్రారంభం కాబోతున్నప్పటికీ  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం అత్యంత విచారకరమన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అయిన విద్యా ప్రక్రియలో పాఠ్యపుస్తకాలు కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి పుస్తకాలు అందకపోవడం వల్ల బోధన అభ్యసన ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. విద్యాహక్కుచట్టం స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా అవసరమైన పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచాలని విద్యార్థుల విద్యా ప్రయోజనాల దృష్ట్యా పాఠ్యపుస్తకాల సరఫరాలో జాప్యాన్ని నివారించి. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.