13 June, 2026 | 10:54 PM

కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసుల నోటీసులు

13-06-2026 09:47 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ఏర్పాటు చేసి గౌరవం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నేపథ్యంలో శనివారం సుమారు 24 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేసు వివరాలతో కూడిన నోటీసులు అందించారు.

కార్యక్రమం సందర్భంగా జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న వారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ టోనీ, బైరినేని రాము, శ్రీకాంత్ గౌడ్, మునిగాల రాజు, మిరాల శ్రీనివాస్, ఎడ్ల తిరుపతి, బండి పరుశురాం, కొంపెల్లి శ్యామ్ తదితరులు ఉన్నారు. పట్టణ ఎస్‌ఐ శంకర్ నాయక్ సంబంధిత నాయకులకు నోటీసులు అందజేశారు. రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.