13 June, 2026 | 10:54 PM

నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం అత్యంత దురదృష్టకరం

13-06-2026 09:44 PM

కాంగ్రెస్ పార్టీ నాయకులు దాయం ఝాన్సీ రాజిరెడ్డి

తుంగతుర్తి,(విజయక్రాంతి): మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దాయం ఝాన్సీ రాజిరెడ్డి శనివారం  ఒక ప్రకటనలో ఆరోపించారు. బీజేపీ వరుసగా కుట్రలు చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. మొన్నటి వరకు కేవలం ఓట్ల చోరీకి పాల్పడిన ఆ పార్టీ ఇప్పుడు ఏకంగా సీట్ల చోరీకి కూడా దిగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్నారు.

ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కోల్పోయి, బీజేపీ అనుబంధ సంఘంగా పనిచేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే మహిళలకు రిజర్వేషన్లు చేయిస్తామని చెప్పి, "బేటి బచావో- బేటి పడావో" అని నినాదించే బిజెపి ఒక మహిళా నాయకురాలి నామినేషన్ ను ఇలా తిరస్కరించడం నామినేషన్‌ను అత్యంత దురదృష్టకరమని అన్నారు.నిబద్ధత కలిగిన గాంధేయవాది, కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను కుట్రపూరితంగా తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు.