22 August, 2026 | 10:48 PM

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

13-06-2024 04:56 PM

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చి పలు అంశాలపై చంద్రబాబు సంతకాలు చేశారు. సీఎంగా చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్  యాక్ట్ రద్దుపై రెండో సంతకం,  పింఛన్ ను రూ, 4 వేలకు పెంచే ఫైల్ పై మూడో సంతకం,  అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు. ఐదు ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టటానికి, అమరావతి సచివాలయానికి బయలుదేరిన, సీఎం చంద్రబాబుకి  రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు.