23 May, 2026 | 1:12 AM

మే 10న టీజీ ఆర్జేసీ ఎంట్రెన్స్

23-03-2025 12:22 AM

రేపటి నుంచి దరఖాస్తులు

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2025 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడి యం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గు రుకుల విద్యాలయ సంస్థ టీజీ ఆర్జేసీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రస్తుతం 10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని, ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి. మే 10న ఎంట్రన్స్ నిర్వహించనున్నారు. పరీక్షలో పొందిన మెరిట్, రిజర్వేషన్ ఆధా రంగా సీట్లు కేటాయిస్తారు.