టెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టెట్ పేపర్-1 లో 85,996 అభ్యర్థులకు 57,725 మంది అభ్యర్థులు (67.13 శాతం) అర్హత సాధించారు. టెట్ పేపర్-2లో 1,50,491 మందికి 51,443 మంది అభ్యర్థులు (34.18 శాతం) అర్హత సాధించారు.
టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ schooled.Telangana.gov.in లో ఫలితాలు విడుదలయ్యాయి. మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగగా, జూన్ 3న ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైంది. బుధవారం తుది కీ విడుదల చేశారు. టెట్ పరీక్షలకు 2,86,381 దరఖాస్తులు చేసుకోగా, 2,36,487 మంది హాజరయ్యారు. డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత శాతం పెరిగింది.






