కువైట్ లో భారీ అగ్నిప్రమాదం.. 41 మంది సజీవదహనం
కువైట్: గల్ఫ్ దేశం కువైట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఓ ఆరు అంతస్తు భవనంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఐదుగురు భారతీయులతో సహ 41 మందికి పైగా సజీవదహనం కాగా, మరో 50 మందికిపైగా తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సమాచారం అందుకున్న పైర్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కువైట్ ఉప ప్రధాని ఫహాద్ యూసఫ్ అల్ సభా సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారని, కేరళ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు.
కువైట్ అగ్ని ప్రమాదంపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో మరణించిన 41 మంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వేంటనే కువైట్ లోని భారతీయ రాయబారి అధికారులను ఘటనా స్థలాన్ని సందర్శించి.. గాయపడ్డి దావాఖనాల్లో చికిత్స పొందుతున్న 50 మందిని పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రమాదంపై కువైట్ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం ఎదురు చేస్తున్నట్లు పేర్కొన్నారు.






