వివేకానంద ఆవాసానికి టీజీఎన్పీడీసీఎల్ చేయూత
07-07-2026 08:34 PM
బైంసా,(విజయక్రాంతి): భైంసా పట్టణంలోని వివేకానంద నిరాశ్రిత బాలల ఆవాస అభివృద్ధికి టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ డివిజన్ ట్రస్ట్ ప్రతి నెల రూపాయలు 20 వేలు వేలు చొప్పున న అందజేస్తుందని టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఈ సహాయం సంస్థ సీఎండి వరుణ్ రెడ్డి, ఎఈ కన్స్ట్రక్షన్ జె. చవాన్, ఎఈ సుభాష్, డిఈ తిలక్, ఏఈ మోహన్ కుమార్ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యానికి సహకరిస్తున్నందుకు వివేకానంద ఆవాస నిర్వహణ కమిటీ టీజీ ఎన్పీడీసీఎల్ సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.






